రాజయ్యకు.. మంత్రి కేటీఆర్ బంపర్ ఆఫర్..?

తెలంగాణాలో సీఎం కేసీఆర్ కొత్త పంథాకు తెరలేపారు. ఇంత కాలం సొంత పార్టలో ఉన్న ప్రత్యర్థులను పసిగట్టేందుకు ఎంతో మంది మహానేతలు మల్లగుల్లాలు పడ్డారు. అయితే రాజకీయ చతురత కలిగిన.. కేసీఆర్ ఇప్పుడు దానికి కొత్త ఫార్ములా కనుగొన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే.. ప్రతిపక్సాల కంటే ముందు సొంత పక్సాన్ని గెలవాలని నిర్ణయించుకున్నారు. మన పెద్దలు చెప్పనట్టు ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న ఫార్ములాను ఫాలో అవుతున్నారు. అందులో భాగంగానే.. తన పార్టీలోని కోవర్టులను కనిపెట్టేందుకు.. ముందుగానే అభ్యర్థులను నిలబెట్టేశారు.

ఇక టికెట్ రాని వాళ్లు.. తలోదారి చూసుకోగా.. మిగిలిన నేతలతో.. అసలు రాజకీయం నడపాలన్నదే కేసీఆర్ ప్లాన్. అందులో భాగంగానే నేతల మద్య సయోద్య ఉన్న అన్ని నియోజక వర్గాలలో అభ్యర్థలను ప్రకటించి.. జనగాం, స్టేషన్ ఘన్ పూర్, గోషా మహల్ లాంటి నాలుగు చోట్ల అభ్యర్థులను ప్రకటించలేదు. దానికి చాలా కారణాలు ఉండచ్చ. అయితే అభ్యర్థులకు సయోద్య కుదిర్చి.. వినకపోతే పొగ పెట్టడం కేసీఆర్ స్ట్రాటజీ.

రాజయ్యకు బంపర్ ఆఫర్..

ఇప్పుడు ఈ నాలుగు నియోజక వర్గాలలో వర్గపోరుకు చెక్ పెట్టేందుకు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. మొదటగా స్టేషన్ ఘన్ పూర్ ను ఎంచుకున్నారు. అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్యకు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అస్సలు పొసగడం లేదు. దాంతో అక్కడ అడుగు పెట్టిన కేటీఆర్ వారి మద్య సయోద్య కుదిర్చారు. అక్కడ రాజయ్యకు భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వయసు రిత్యా కడియం శ్రీహరికి ఈ సారి చివరి ఎన్నికలు కావడంతో.. ఆయనకు సహకరించాలని కోరినట్టు తెలుస్తోంది. దానికి ప్రతిగా.. కడియం ఎమ్మెల్సీ స్థానంలో.. రాజయ్యను మండలికి పంపి.. అటునుంచి కేబినేట్ లోకి తీసుకుంటామని హామి ఇచ్చినట్టు తెలుస్తోంది.

రాజయ్యకు కూడా ఆఫర్ నచ్చడంతో.. ఓకే అన్నారట. దానికి తోడు సర్పంచ్ నవ్య ఇష్యూను కేటీఆర్ తో రాజయ్య చర్చినట్టు తెలుస్తోంది. నవ్య ఇష్యూ వెనకాల కడియం ఉన్నారని ఆయన ఆరోపించారట. అయితే ఎన్నికల తర్వాత వాటిని చూసుకుందామని.. మొదట ఆయన గెలుపుకు సహకరించాలని కేటీఆర్ కోరారట. నిజానికి సర్పంచ్ నవ్య వివాదం తర్వాతే రాజయ్య చాపకిందకు నీళ్లు వచ్చాయి.

Related Posts