బిగ్ బాస్ హౌజ్ లో మరో ప్రేమ జంట పుట్టిందోచ్…

పుట్టిందండది పుట్టింది.. బిగ్ బాస్ హౌజ్ లో ప్రేమ జంట పుట్టేసింది. మొదట్లో ప్రశాంత్, రతికల మధ్యా ట్రాక్ నడుస్తుంది అని అనుకున్నారు. కానీ వీరి మధ్యలో గొడవలు స్టాట్ అవడంతో ఆ లవ్ బెడద తప్పింది ప్రేక్షకులకు. కానీ ఇంట్లో ప్రేమ జంటలు లేకపోతే ఎలా అనుకున్నారో ఏంటో? మరో జంటను వెంటనే దించేశారు. అంటే బయట నుంచి కాదండోయ్.. ఆ ఉన్న కంటెస్టెంట్లోనే ప్రేమ చిగురించినట్టుంది. మరి ఓ సారి ఆ జంట ఎవరు? ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుందాం పదండి..

బిగ్ బాస్ హౌస్ లో లవ్ స్టోరీలు కామనే హౌస్ లోకి వెళ్లిన వారు చాలా మంది ప్రేమలో పడ్డారు. ఇప్పటికే బిగ్ బాస్ లో చాలా లవ్ ట్రాక్స్ చూపించారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 7లో కూడా ఓ లవ్ ట్రాక్ మొదలైందని తెలుస్తోంది. అయితే రతిక మనోడిని గట్టిగానే వాడుకొని ఆడుకుంది అంటూ చూసిన ప్రేక్షకులు అనుకున్నారు. దీంతో ఇప్పుడు హౌస్ లో మరో లవ్ స్టోరీ మొదలైంది. హౌస్ లో డాక్టర్ బాబు గౌతమ్, లాయర్ పాప శుభ శ్రీ మధ్య ఇప్పుడు ప్రేమ చిగురించింది.

ఈ ఇద్దరు గుసగుసలు ఆడుకుంటూ చాలా సార్లు కనిపించారు. నిన్నటి ఎపిసోడ్ లో ఈ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేను మాట్లాడితే నచ్చడం లేదా.. మెంటల్‌లా కనిపిస్తున్నానా.. అంటూ శుభ అడగటం దానికి గౌతమ్ నచ్చుతుంది కాబట్టే కదా లాయలిటీ ఉంది.. అందుకే నిన్ను భరిస్తున్నా అన్నాడు. దానికి శుభ శ్రీ తెగ సిగ్గుపడింది. ఇచ్చిన మాట మీద నిలబడటమే లాయలిటీ అంటూ క్లారిటీ ఇచ్చాడు. కంటెండర్‌గా నేను-ప్రిన్స్‌లో ఎవరు డిజర్వ్ అని అడిగితే నువ్వు ఎందుకు సెలక్ట్ చేయలేకపోయావ్ అంటూ గౌతమ్ అడిగాడు. ఆతర్వాత ఇద్దరూ సరదాగా మాట్లడుకుంటూ ఉండగానే గౌతమ్ శుభ కు ఓ హగ్ ఇచ్చాడు. ఆతర్వాత బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కూడా ఈ ఇద్దరు పార్ట్నర్స్ గా ఉన్నారు. మొత్తానికి బిగ్ బాస్ ఇంట్లో ఓ లవ్ ట్రాక్ మొదలైంది.

Related Posts