రామ్ చరణ్ కొత్త ఫ్రెండ్ ఎవరో తెలుసా?

పవర్ ఆఫ్ పెన్: చిరంజీవి ఎన్నో సినిమాల్లో నటించి ఇప్పటికీ స్టార్ నటుడుగానే కొనసాగుతున్నాడు. అంతేకాదు ఆయన నటవారసత్వాన్ని తన కొడుకు రామ్ చరణ్ కు అందించారు. మొదట్లో నెగటివ్ టాక్ మూటగట్టుకున్నా.. ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ గా అవతారం ఎత్తాడు చెర్రీ.ఏకంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్‌గా మారాడు. ఈ మెగా ప‌వ‌ర్‌స్టార్ సోష‌ల్‌మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గానే క‌నిపిస్తుంటారు. చిరుత సినిమాతో తెలుగ చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌య‌మైన రామ్‌చ‌ర‌ణ్ ఆ త‌ర్వాత ఎన్నో గొప్ప సినిమాలు తీసారు.

మగధీర, రంగస్థలం సినిమాల్లో నటించి రామ్ చరణ్ అంటే ఏంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాలు ఎంతో పేరు సంపాదించి పెట్టాయి కూడా. అయితే సినిమాలతోనే కాదు ప్రేక్ష‌కుల‌ను ఇంట్రెస్టింగ్ పోస్టుల‌తోనూ ఆక‌ట్టుకుంటారు చెర్రీ. అయితే, తాజాగా, సోష‌ల్‌మీడియాలో త‌న లేటేస్ట్ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. మై న్యూ ఫ్రెండ్ అంటూ త‌న కొత్త ఫ్రెండ్‌ను ప‌రిచ‌యం చేశారు రామ్‌చ‌ర‌ణ్. ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ ఆ కొత్త ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా…? రామ్‌చ‌ర‌ణ్ కొత్త‌గా పెట్టిన‌ పోస్ట్‌లో త‌న కొత్త ఫ్రెండ్ అంటూ న్యూ హార్స్‌ను అభిమానుల‌కు ప‌రిచ‌యం చేశారు. హార్స్‌తో దిగిన ఫోటోల‌ను కూడా చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

అయితే రామ్‌చ‌ర‌ణ్‌కు హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే అందులో చిన్న‌ప్ప‌టినుంచే శిక్ష‌ణ తీసుకున్నారు. అప్ప‌టి నుంచే ఆయ‌న గుర్రాలను కూడా పెంచుతున్నారు. మ‌గ‌ధీర సినిమాలో కూడా చ‌ర‌ణ్ హార్స్‌రైడింగ్ చేయ‌డం మ‌నం చూస్తాం. ఆ సినిమాలో ఉన్న గుర్రం కూడా చ‌ర‌ణ్‌దేన‌ట‌…దాని పేరు కాజ‌ల్ అని కూడా చాలా సంద‌ర్భాల్లో చ‌ర‌ణ్ ప్ర‌స్తావించారు. ఇప్పుడు తాజాగా పెట్టిన పోస్ట్‌లో బ్లాక్ క‌ల‌ర్‌లో ఉన్న గుర్రం త‌న కొత్త ఫ్రెండ్ అంటూ అభిమానుల‌కు ప‌రిచ‌యం చేశారు. రామ్‌చ‌ర‌ణ్ దానికి ఒక పేరును కూడా పెట్టారు. ఆ గుర్రాన్ని ముద్దుగా Blaze అని పిలుచుకుంటార‌ట‌.. రామ్ చరణ్ కు పోలో అండ్ హార్స్ రైడింగ్ క్లబ్ కూడా ఉంద‌ట‌..

రామ్‌చ‌రణ్ కొత్త హార్స్‌ పేరేంటి అనుకుంటున్నారా? అది కూడా తెలుసుకుందాం.. రామ్‌చ‌ర‌ణ్‌కు హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే అందులో చిన్న‌ప్ప‌టినుంచే శిక్ష‌ణ తీసుకున్నారు. అప్ప‌టి నుంచే ఆయ‌న గుర్రాలను కూడా పెంచుతున్నారు. మ‌గ‌ధీర సినిమాలో కూడా చ‌ర‌ణ్ హార్స్‌రైడింగ్ చేయ‌డం మ‌నం చూస్తాం. ఆ సినిమాలో ఉన్న గుర్రం కూడా చ‌ర‌ణ్‌దేన‌ట‌…దాని పేరు కాజ‌ల్ అని కూడా చాలా సంద‌ర్భాల్లో చ‌ర‌ణ్ ప్ర‌స్తావించారు. ఇప్పుడు తాజాగా పెట్టిన పోస్ట్‌లో బ్లాక్ క‌ల‌ర్‌లో ఉన్న గుర్రం త‌న కొత్త ఫ్రెండ్ అంటూ అభిమానుల‌కు ప‌రిచ‌యం చేశారు. రామ్‌చ‌ర‌ణ్ దానికి ఒక పేరును కూడా పెట్టారు. ఆ గుర్రాన్ని ముద్దుగా Blaze అని పిలుచుకుంటార‌ట‌.. రామ్ చరణ్ కు పోలో అండ్ హార్స్ రైడింగ్ క్లబ్ కూడా ఉంద‌ట‌..

మన మెగాస్టార్ ఫ్యామిలీ వారసుడికి భక్తి కూడా ఎక్కువేనండోయ్.. ప్ర‌తి సంవ‌త్స‌రం రామ్‌చ‌ర‌ణ్ అయ్య‌ప్ప దీక్ష తీసుకుంటారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఎంతో నిష్టగా అయ్యప్ప‌ను కొలుస్తారు. చాలాసంద‌ర్భాల్లో అయ్య‌ప్ప మాల‌లో క‌నిపించ‌డం చూసే ఉంటాం. మాలలోనే సినిమా ప్ర‌మోష‌న్లో పాల్గొన‌డం ఇంత‌కుముందు చూశాం. ప్రస్తుతం రామ్ చరణ్ ముంబైలో ల్యాండ్ అయిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ముంబైలోని ఎయిర్ పోర్టులో మాలలో కనిపించారు. ఓ యాడ్ షూట్ కోసం అక్కడికి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

Related Posts