నిద్రలో గురక పెడుతున్నారా? అయితే అంతే సంగతులు

మీకు నిద్రలో గురక పెట్టే అలవాటు ఉందా.. అయితే మి ఆరోగ్యం ప్రమాదం లో ఉన్నటే.  గురక పెట్టే వాళ్లకు గుండె జబ్బును వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందట. ఇటీవల చేసిన పరిశోధనల్లో గురక పెట్టే వాళ్ళలో 70 శాతం మందికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చాయట.

అంతే కాదు.. గురకపెట్టే యువకులకు.. స్ట్రోక్‌ వచ్చే ముప్పు 60 శాతం ఉంటుందని తేల్చారు. గురక పెట్టనివాళ్లతో పోల్చితే గుండె సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదం 5 రెట్లు ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. ఈ అధ్యయన ఫలితాలు ఆమ్‌స్టర్‌డామ్‌లో నిర్వహించిన యురోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ కాంగ్రెస్‌లో ప్రకటించారు.

అమెరికావ్యాప్తంగా 20 నుంచి 50 ఏండ్ల మధ్య వయసు గల 7,66,000 మందిపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించి ప్రకటించారట. కాబట్టి ఇప్పుడే కొంచం జాగ్రత్త పడండి.

Related Posts