అన్నగారి ప్లాన్ ను కేసీఆర్ కాపీ కొట్టారా..?

నందమూరి తారక రామారావు పేరు తెలియని తెలుగువాడు ఉండడు. అలాంటి అన్నగారి పెట్టిన పార్టీతో చాలా మందికి రాజకీయ ఎంట్రీ దొరికింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్న గారి మ్యానియాతో గెలిచి.. ఇప్పుడు ఎంతో ఉన్నత స్థానాల్లో చాలా మంది ఉన్నారు. అలా ఎదిగిన వారు.. రాష్ట్ర స్థాయి నుంచి జాతియ స్థాయి వరకూ పేరు తెచ్చుకున్నారు. పర్వతనేని ఉపేంద్ర నుంచి.. చంద్రబాబు, కేసీఆర్ ల వరకూ అంతా అన్నగారి సారథ్యంలో నడిచిన వారే. అయితే ఆయన చతురతు, రాజకీయాలను కాపీ కొట్టి నేటికి కొందరు నాయకులు రాజకీయం చేస్తున్నారు. అందులో కేసీఆర్ ఉద్దండులు. సినిమా రంగం నుంచి వచ్చి.. ఎన్టీఆర్ తెలుగు దేశాన్ని స్థాపించి.. అందలమెక్కారు. సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణ ఉద్యమ నినాదంతో ఆ కోరికను తీర్చుకున్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడారు అనే పేరు మాత్రం తెచ్చుకున్నారు. అయితే ఎందో ఉద్యమకారులను అణిచి వేశారన్న అపకీర్తి మూట గట్టుకున్నారు.

అన్నగారు తెలుగు నాట.. ఎదురు లేని మనిషిగా నిలదొక్కుకున్న తర్వాత .. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. తన పార్టీని.. జాతీయ స్థాయిలో విస్తరించాలని ఏర్పాట్లు మొదలు పెట్టారు. దానికి ఒక పేరు కూడా ఫైనల్ అయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అదేంటంటే.. తెలుగు దేశం మాదిరిగానే.. భారతదేశం అని ఒక జాతీయ పార్టీని మొదలు పెట్టాలని అనుకున్నారట. దీని కోసం ఆయన అహర్నిశలు కష్టపడ్డారని ఆయన సన్నిహితులు వివిధ సందర్భాలలో చెప్పారు. ఆయన ఆలోచనలకు… జమ్మూకాశ్మీర్ లోని ఫరూక్ అబ్దుల్లా నుంచి.. తమిళనాడులోని నేతల వరకూ సై అన్నారట. అయితే ఆ పార్టీ కార్యరూపం దాల్చక ముందే.. ఆయన స్వర్గస్తులయ్యారు. ఇదంతా ఆయన వెంటే ఉండి చూసిన..కేసీఆర్ ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూస్తున్నారు. అందుకోసం.. మహారాష్ట్రా, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్నాటకాలలో ఇప్పటికే ప్రయత్నాల ముమ్మరం చేశారు. ఆయన జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి ఢిల్లీని అడ్డాగా మార్చుకోవాలని కేజ్రీవాల్ తో కూడా జతకట్టారు. అదే ఇప్పుడు నడుస్తోన్న లిక్కర్ స్కాముకు మూలం అని తెలుస్తోంది.

Related Posts