మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల ఎంత నష్టమో తెలుసా?

దేశ వ్యాప్తంగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చిస్తున్నారు. అసలు ఇంతకీ మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి..? ఈ బిల్లును ఇప్పుడే ఎందుకు తీసుకుని వచ్చారు..? ఈ బిల్లును గతంలో ఎప్పుడైనా ప్రవేశ పెట్టారా..? అప్పుడు ఎందుకు చట్టం చేయలేదు..? ఈ మహిళా బిల్లుకు అసదుద్దీన్ పార్టీ అయిన మజ్లీస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోంది..? ఈ బిల్లు కోసం రాజ్యాంగ సవరణే ఎందుకు చేయాలి..? ఈ బిల్లుకు చట్టబద్దత వస్తే మహిళలకు కొత్తగా వచ్చే అవకాశాలు ఏమిటో లాంటి ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాం.

గతంలో ఏమ్ జరిగింది..?

రాజ్యాంగం అమలులోకి వచ్చిన దగ్గరి నుంచి.. రిజర్వేషన్లు అనేవి అమలు అవుతూ ఉన్నాయి. అంబేద్కర్ లాంటి మహానుభావుడు.. మొదట బీసీలకు, ఎస్టీలకు ఆ తర్వాత ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించారనే విషయం తెలిసిందే. అయితే అంతటి వ్యక్తి మహిళా రిజర్వేషన్ అనే అంశాన్ని ఎందుకు మరిచిపోయాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? అయితే ఇలాంటి ప్రశ్నకు మన మొదటి ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రూ ఒక ప్రోవర్బ్ చెప్పారు. అదేంటంటే.. ఏనాటి రాజ్యాంగం అయినా ఆనాటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఉంటుందని. దీని ప్రకారం అప్పుడున్న సంప్రదాయ వాదులు.. సాదారణ రిజర్వేషన్లనే ఒప్పుకోలేదు.. బ్రిటీష్ వారి అండదండలతో.. అంబేద్కర్ కృషితో రిజర్వేషన్లు అమలు అయ్యాయి. కానీ మహిళలకు రిజర్వేషన్లు అనే మాటనే ఒప్పుకునే పరిస్థితులు లేక పోవడంతో.. అప్పుడు అంబేద్కర్ తో పాటు చాలా మంది చట్ట సభల్లో వారి ప్రాతినిథ్యం పై గట్టిగా మాట్లాడలేక పోయి ఉండవచ్చు. అయితే విద్యా, ఉపాధి లాంటి అన్నిటిలోనూ మహిళలకు మాత్రం మన రాజ్యాంగం అవకాశం కల్పించింది.

బిల్లు మొదట పార్లమెంట్ లోకి ఎప్పుడు వచ్చింది..?

ఇక దేశంలో మొదటి సారి ఈ బిల్లును పార్లమెంట్ మెట్లు ఎక్కించిన వ్యక్తి మాత్రం.. దేవేగౌడ. మీరు వింటోంది నిజమే.. కేవలం కొన్ని నెలలు మాత్రమే దేశాన్ని నడిపిన దేవేగౌడ కాలంలోనే మహిళలకు మొదటి సారి ఈ బిల్లు వచ్చింది. అయితే అప్పుడున్న పరిస్థితుల వల్ల అది మద్యలోనే ఆగిపోయింది. తర్వాత వచ్చిన వాజ్ పేయి, మన్మోహన్ సింగ్ ల ప్రభుత్వ కాలాలలోనూ ఈ బిల్లును తీసుకు రావాలని బాగానే ప్రయత్నం చేశారు. అయితే 24 పార్టీల అండతో అందలమెక్కిన వాజ్ పేయి ఈ పని చేయలేక పోయారు. ఇక సింపుల్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మిత్ర పక్సాల ఒత్తిడికి తలొగ్గి.. గీత దాట లేక పోయింది. ఇక రెండో దఫాలో దాన్ని.. అప్పటి రాజ్య సభలో సభ్యుడైన ప్రధాని మన్మో హన్ సింగ్ రాజ్యసభలో ప్రవేశ పెట్టారు.

అక్కడ రాజ్యాంగ సవరణ కాకుండా కేవలం చట్టం చేయడానికి మాత్రం మెజారిటీ దక్కింది. ఎలాగోలా రాజ్యసభలో గట్టెక్కిన బిల్లు లోక్ సభలో మల్లీ వాయిదా పడింది. ఇక 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడంతో.. మళ్లీ అటకెక్కింది. అప్పటి నుంచి మరుగున పడిన ఈ బిల్లు మళ్లీ ఇంత కాలానికి తెరమీదకు వచ్చింది.

బీజేపీ టార్గెట్ ఎంటి..?

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అప్రమత్తమైన బీజేపీ.. కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. వాళ్లు సగంలో ఆపేసిన మంచి పనులను తాను భుజాలపైన వేసుకుని.. వారి అమ్ముల పొదిలోని అస్త్రాలను కాజేస్తోంది. వచ్చే లోక్ సభలో కాంగ్రెస్ పార్టీకి హామీలు లేకుండా బీజేపీ ప్రభుత్వమే అమలు చేస్తోంది. అయితే కేంద్ర మంత్రి మేఘ్వాల్ ఈ బిల్లు లోక్ సభలో రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశ పెట్టారు. దీనిపై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. అయితే ఇది రాజీవ్ గాంధీ కల అని సోనియా ప్రకటించి భావోధ్వేగానికి గురయ్యారు. ఎవరెన్ని చెప్పినా.. ఈ బిల్లుకు మాత్రం అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో… వన్ సైడ్ ఓటింగ్ జరిగింది.

మజ్లిస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించింది..?

దేశంలలోని ఒక్క పార్టీ మినహా అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి. ఇంతకీ ఈ బిల్లును వ్యతిరేకించిన పార్టీ ఏదని ఆలోచిస్తూ ఉన్నారా..? అదేనండి మన హైదరాబాద్ వేదికగా నడుస్తోన్న ఆల్ ఇండియా ముస్లీం ఇత్తేహాదుల్ మజ్లీస్ పార్టీ. ఈ పార్టీ అధ్యక్సుడైన అసదుద్దీన్ ఒవైసీ, ఈ బిల్లులో లోపాలున్నాయని వ్యతిరేకించారు. ఆయనతో పాటు ఔరంగాబాద్ కు చెందిన ఎంఐఎం పార్టీ ఎంపీ కూడా దీన్ని వ్యతిరేకించారు. అసలు ఎందుకు ఈ బిల్లును వ్యతిరేకించారంటే.. ఈ బిల్లు పైకి మాత్రం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అని చెప్తూన్నా.. దీని లోపల చాలా లొసుగులు ఉన్నాయి. అందులో మేజర్ ది ఏంటంటే అసలు ఏ మహిళలకు ఈ రిజర్వేషన్ దక్కుతుందనేది పాయింట్. దీనిపైనే అసదుద్దీన్ పార్లమెంట్ లో వాదించారు. నిజానికి ఆయన మాత్రమే ఓబీసీ మహిళలకు ఎందుకు ఇందులో అవకాశం కల్పించలేదు అని కొట్లాడారు. 33 శాతం రిజర్వేషన్లను తీసుకొచ్చి జనరల్ కేటగిరిలో చేర్చారు.

ఈ బిల్లు వల్ల నష్టం ఏంటి..?

జనరల్ కేటగిరీలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల.. కేవలం అగ్రవర్ణాలకు చెందిన వారు మాత్రమే పార్లమెంటుకు వెళతారు. ఇక ముస్లింలకు ఓబీసీ మహిళలకు ఇందులో ప్రాతినిథ్యం కచ్చితంగా తగ్గుతుంది. 2008 డీలిమిటేషన్ కమీషన్ ప్రకారం 412 సీట్లు జనరల్ కోటాలో ఉండగా.. 84 సీట్లు సెడ్యూల్ క్యాస్ట్ లకు.. 47 సీట్లు సెడ్యూల్ ట్రైబ్స్ కు కేటాయించారు.

ఈ బిల్లు చట్టంగా మారినా ఇందులోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయి. అంటే మొత్తంగా 181 సీట్లు మహిళలకు కేటాయిస్తారు. అందులో జనరల్ కోటా పోగా మిగిలినవి sc,st లకు దక్కుతాయి. ఎలాగో sc,st లకు రిజర్వేషన్ ప్రకారం దక్కుతాయి. మిగిలిన ముస్లిం, ఓబీసీల పరిస్థితి ఏంటి..? నిజంగా ముస్లీం, ఓబీసీలకు చెందిన మహిళలకు జనరల్ అభ్యర్థులుగా నిలబడే.. ఆర్థికంగా బలమున్న వ్యక్తులతో నిలబడే శక్తి ఉంటుందా అనేది పాయింట్. ఇదే విషయాన్ని అసద్ పార్ల మెంట్ లో మాట్లాడారు. అయితే అక్కడ ఆయన మాటల్ని పట్టించుకోకుండా అన్ని పార్టీలు బీజేపీ బిల్లుకు ఓటేయడంతో లోక్ సభలో గట్టెక్కింది. ఇక రాజ్యసభలో గట్టెక్కుతుంది. దీనిపై రాడ్ఎదన్లాతం అవసరం లేదు.. బిల్లు చట్టంగా మారిన తర్వాత చూసుకుందాం మార్పులు ఉంటే అని అమిత్ షా ప్రకటించారు. అయితే బిల్ పాస్ అయ్యాక మళ్లీ దాంట్లో సవరణలు చేయాలంటే.. ఇంప్లిమెంట్ అయ్యాక.. మళ్ళీ ఎన్ని దశాబ్దాలు ఆగలో అని విమర్శకులు అంటున్నారు. చూద్దాం ముందు ముందు ఏమవుతుందో..

Related Posts