రాజమౌళి ఎందుకు బాహుబలి, మగధీరలో ఇలాంటి సేమ్ సీన్ పెట్టారు?

power of pen: మాంచి కంటెంట్, కటౌట్, సూపర్ నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్ ఎవరు అంటే.. ఇంకెవరు మా రాజమౌళినే అని చెప్పేస్తారు ఎవరైనా.. కనీసం రెండు మూడు సంవత్సరాలు పట్టినా సరే మంచి సినిమాను అందిస్తారు ఈ డైరెక్టర్. కళ్లకు సంతృప్తి, మనుసుకు ఆహా మంచి స్టోరీ చూశామే అనే ఫీలింగ్.. పోతే పోని డబ్బులు చాలా ఎంజాయ్ చేశాం అనే తృప్తి ఇలా ఉంటే సరిపోదా థియేటర్ కు వెళ్లి డబ్బులు పెట్టాలంటే.. మరి ఈ రేంజ్ లో సినిమాను అందించడంలో ఎప్పుడు కూడా విఫలం కానీ డైరెక్టర్ ది గ్రేట్ రాజమౌళి.

 

అంత బాగానే ఉంది కానీ.. రాజమౌళి ఒక రెండు సినిమాల్లో సేమ్ సీన్స్ రిపీట్ చేశారు? అంటే సీన్స్ కాదండోయ్.. కానీ రెండు సినిమాలకు ఒకే డైరెక్టర్ కదా.. కొన్ని సార్లు అనుకోకుండానే వస్తాయేమో.. నిజంగా ఇప్పుడు నేను చెప్పేవరకు మన సూపర్ డైరెక్టర్ ఈ విషయాన్ని గమనించారో లేదో కూడా తెలియదు. సర్ ఈ ఆర్టికల్ గనుక మీరు చూస్తే తప్పుగా అనుకోవద్దండి.. ఏదో మీపై అభిమానంతో ఈ రెండు సినిమాలు వెంట వెంటనే చూస్తే రెండు సీన్లు ఒకేలా కనిపించాయి. ఇంతకీ ఏంటబ్బ ఈ సీన్లు అనుకుంటున్నారా? అయితే ఈ ఫోటోలను చూసేయండి…

ఒహో.. చూసేసారా.. ఒకటి బాహుబలి సినిమాలో, మరొకటి మగధీర సినిమా నుంచి.. అయితే బాహుబలిని కట్టప్ప చంపినప్పుడు పడిన నీడ, మగధీర సినిమాలో రామ్ చరణ్ విలన్ ను చంపినప్పుడు పడిన నీడ ఇంచుమించు సేమ్ ఉంటాయి. మనుషులు వేరు కానీ యాంగిల్ ఒకటే.. అందుకే ఈ రెండు సినిమాలను చూడగానే నాకు అనిపించిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను.. ఒకవేళ మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి…

Related Posts