జైలులో ఉన్న మహిళా ఖైదీలు ఎలా గర్భం దాల్చారు? దీని మీద కోర్టు ఏమందో తెలుసా?

కొన్ని విషయాలు ఎంత ఆలోచించినా కూడా అర్థం కాదు. కానీ కొందరికి మాత్రం వీటికి సంబంధించిన సమాచారం మాత్రం తెలుస్తుంది. కానీ వారు నోరువిప్పరు. పెదవి విరిచి చెప్పినప్పుడు మాత్రమే కొన్ని విషయాలు బయటకు వస్తాయి. అయితే ప్రస్తుతం జైల్ లో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చడం ఆ రాష్ట్రంలో పెను దుమారం రేపుతంది. ఇంతకీ ఆ రాష్ట్రం ఏంటి? ఎందుకు ఇలా జరిగింది. ఇంతకీ ఈ కేసు కోర్టు వరకు వెళ్లిందా లేదా అనే విషయాలు తెలుసుకుందాం..

పశ్చిమ బెంగాల్ లోని కారాగారాలు, కరెక్షనలో హోమ్స్ లలో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలు గర్భం దాల్చారట. దీనికి సంబంధించిన కలకత్తా హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. కేసు విచారణ సందర్భంగా కోర్టు సీరియస్ అయింది. రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న మహిళా ఖైదీల దుస్థితిపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చడం ఆందోళనకరమని విచారం వ్యక్తం చేసింది

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఖారాగారాల్లో మహిళా ఖైదీలు ఏకంగా 196 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు హైకోర్టు ఏర్పాటు చేసిన అమికస్ క్యూరీ కోర్టుకు నివేదించింది. ఈ వ్యవహారంపై అమికస్ క్యూరీని ఏర్పాటు చేసిన హైకోర్టు రాష్ట్రంలోని జైళ్ల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కోరింది. దీనిపై తాజాగా అమికస్ క్యూరీ నివేదకను కోర్టుకు సమర్పించింది.

మహిళా ఖైదీలు జైలులో ఉండగానే గర్భం దాల్చి, ప్రసవిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఏకంగా 196 మంది పిల్లలు పుట్టారని నివేదించింది. ఈ సమస్య నివారణకు.. మహిళా ఖైదీలు ఉన్న ఎన్ క్లోజర్ లలోకి పురుష ఉద్యోగులు ప్రవేశించకుండా నిషేధాన్ని ప్రతిపాదిస్తూ అమికస్ క్యూరీ నివారణ చర్యను సూచించింది. ప్రస్తుతం జైళ్లలో గర్భంతో ఉన్న మహిళా ఖైదీలు, తదుపరి జననాలను దృష్టిలో ఉంచుకొని ఈ సిఫార్సు చేసింది.

Related Posts