తప్పు చేస్తున్నా కూడా హీరోనా? సినిమా ధోరణి ఎందుకిలా?

ఈ మధ్య కాలం లో సినిమా పోకడ పూర్తిగా మారిపోతుంది. ఒకప్పుడు ఇల్లు, కుటుంబం, ప్రేమా, ఆప్యాయతలు, ఇలా ఎన్నో కలగలుపుకొని, నవ్వులను పంచుతూ ఉండేవి సినిమాలు. మనసును హాయిగా ఉంచుకోవడానికి థియేటర్ కు వెళ్లాలి అనిపించేది. అంతే కానీ ఇప్పుడు వచ్చే సినిమాల్ల భయం, చంపడం, నరకడం, వినాశనాలు, స్మగ్లింగ్ వంటి కథలను ఆధారంగా చేసుకొని ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అలాంటి సినిమాలనే ప్రేక్షకులు ఆధరించడం విడ్డూరుం. హీరో అంటే రౌడీలను సన్మార్గంలో పెట్టేవాడు. తప్పును సహించని వారిలా ఉండేవారు. కానీ నేటితరం సినిమాల్లో తప్పు చేసి ఎలా తప్పించుకోవాలి? తప్పు దారులు ఎలా ఎంచుకోవాలి? బాధల్లోంచి బయపడాలి అంటే ఎలాంటి పనులను అయినా చేసేయచ్చు అన్న చందంగా సినిమాలు రావడం దురదృష్టకరం. 

సినిమా అంటే ఒక హీరో, ఒక విలన్, హీరోయిన్ ఇలా కొన్ని క్యారెక్టర్స్ ప్రత్యేకంగా సృష్టించుకుంటారు.హీరో అంటే మంచివాడు, విలన్ అంటే చెడ్డవాడు అని ఒక భావన మనలో ఉండేది.కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.హీరో అయినా విలనైనా కూడా అన్ని ఎలివేషన్స్ కావాలి మనకు.విలనిజంతో కూడిన హీరోని బాగా ఇష్టపడుతున్న రోజులు ఇవి.అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలలో హీరో ఎవరో, విలన్ ఎవరో కూడా క్లారిటీ ఉండటం లేదు.చెడ్డ పని చేసిన ఆ హీరోని కూడా మనం మెచ్చుకుంటున్నాం, వారిని ఆరాధిస్తున్నాం.

గత కొన్ని రోజులుగా హాట్ స్టార్ లో ఒక సినిమా బాగా వైరల్ అవుతుంది. ఆ సినిమా పేరు ముకుందన్ ఉన్ని అసోసియేట్స్. అందరూ ఈ సినిమా గురించి పొగుడుతుంటే సినిమా అంత బాగుంటుందా అని చూసేవారు కొందరు. తీరా సినిమా చూసిన తర్వాత పూర్తి స్థాయి నేరపూరితమైన మనస్తత్వం ఉన్న హీరో. ఈ సినిమాలో హీరో చాలా చక్కగా నటించాడు, కానీ మంచి సినిమా అయితే ఖచ్చితంగా కాదు.ఇలాంటి విష ప్రయోగపూర్తమైన సినిమాలను జనాలు ఎందుకు అంగీకరిస్తున్నారో అర్థం కాకుండా ఉంది.అసలు హీరో అంటే సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు అనేదే ముఖ్యమైన ప్రశ్న.హర్షద్ మెహతా లాంటి ఒక ఆర్థిక నేరగాడిని ఇప్పటికీ చాలామంది ఆరాధిస్తున్నారు అంటే చూసే జనాల దృష్టి కూడా ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

జనాలకి ఇప్పుడు పుష్పా సినిమాలోని హీరో లాగా స్మగ్గింగ్ చేస్తేనే ఇష్టం. లాయర్ అంటే నేరాలను ఎలా లీగల్ గా చేయాలో చెప్తేనే ఇష్టం.దీన్ని బట్టి మన విలువలు ఎంతలా పాతాళానికి పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు.ఈ దివాలా కోరు దిక్కుమాలిన సినిమాలు చేసి జనాల మనసులను ఇంకా కలుషితం చేయడం తప్ప వచ్చే లాభం ఏమీ లేదు.ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ సినిమాలో హీరో లాయర్ పాత్రలో ఉండి కెరియర్ లో తొక్కబడితే అడ్డదారులు తొక్కుతాడు.ఆ హీరోకి సపోర్ట్ చేసే హీరోయిన్ ఫైనల్ గా సినిమా పెద్ద హిట్టు దాన్ని బట్టి మనకు ఏం కావాలో అర్థమైంది అనుకుంటా అంటూ ఇలాంటి సినిమాలను నచ్చని వారు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పోకడలు మారి మళ్లీ మంచి సినిమాలు వస్తే థియేటర్లలో చూడాలని ఆశపడేవారు నేటికి ఉన్నారు. కానీ హీరోయిన్ లకు చోటు లేకుండా కేవలం తప్పుడు మార్గాల ద్వారా హీరో అనిపించుకునే ఇలాంటి సినిమాలు మాకెందుకు అంటున్నారు మరికొందరు.

Related Posts